టిఫిన్ దుకాణంలో ఘర్షణ.. పరస్పర కేసులు: ఎస్ఐ|

0
1

సంతకవిటి (M) తాలాడలో జరిగిన ఘర్షణ ఘటనపై పరస్పర ఫిర్యాదుల ఆధారంగా 2 కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ గోపాలరావు తెలిపారు. శుక్రవారం టిఫిన్ సెంటర్లో జరిగిన గొడవలో దాలినాయుడిపై దాడి చేశారంటూ ఆయన భార్య సన్యాసమ్మ ఫిర్యాదు మేరకు రాగోలు అభి, రాంబాబులపై కేసు నమోదు చేశారు. మరోవైపు తనపై కులం పేరుతో దూషించి దాడి చేశారని అభి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సన్యాసమ్మ, దాలినాయుడుతో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదైందన్నారు.

#Boiena Rajesh