రెబ్బెనలో కలకలం: వృద్ధుడి హత్య కేసులో నిందితుడి అరెస్ట్|

0
4

🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్

ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో అత్యంత అమానుష ఘటన చోటుచేసుకుంది. మద్యం, టీ తాగేందుకు కేవలం 20 రూపాయలు ఇవ్వలేదనే కోపంతో మసాడి సోమయ్య (65) అనే వృద్ధుడిని భార్యాకూతుళ్ల కళ్లెదుటే ఓ ఉన్మాది గొడ్డలితో నరికి చంపాడు. పర్సనంబాల గ్రామానికి చెందిన సోమయ్య, తన కుమార్తెను రైలు ఎక్కించేందుకు కుటుంబంతో కలిసి రెబ్బెన రాగా ఈ దారుణం జరిగింది. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో ఆగ్రహించిన తుంగెడ గ్రామానికి చెందిన బోగారపు నగేష్.. గొడ్డలితో సోమయ్య మెడపై వేటు వేయడంతో తల మొండెం నుంచి వేరుపడి ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో నిందితుడు నగేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై బీఎన్ఎస్ (BNS) చట్టం కింద హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.