కట్టు కాలువ సర్వేపై రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం|

0
1

హన్మకొండ జిల్లా శాయంపేట మండలం మైలారం గ్రామంలో వందల ఎకరాలను వరద ముప్పు నుంచి కాపాడే కట్టు కాలువ, రహదారి తీవ్ర ఆక్రమణకు గురయ్యాయి. సుమారు 30 ఫీట్ల వెడల్పు గల ఈ కాలువ, దారి కోసం రైతులు గత 12 ఏళ్లుగా పోరాడుతున్నా రెవెన్యూ అధికారుల నుంచి కనీస స్పందన లేదు. స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతో సర్వే ప్రారంభించినా, అధికారులు ప్రైవేట్ వ్యక్తులతో తూతూమంత్రంగా సగం మాత్రమే చేసి వెళ్లిపోయారు. ప్రజావాణిలో పరకాల ఆర్డీవోను ఈ విషయంపై ప్రశ్నిస్తే, రైతులే సమస్యను పరిష్కరించుకోవాలని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు.. తక్షణమే జిల్లా కలెక్టర్, ఉన్నత రెవెన్యూ అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.