హైదరాబాద్: బొల్లారం, సికింద్రాబాద్, కొంపల్లి, బౌరంపల్లి, సుచిత్ర, తాడ్‌బండ్, బాబ్జీ నగర్ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించినట్లు సోషల్ మీడియాలో ఓ సమాచారం వైరల్‌గా మారింది. ఈ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
అయితే, వైరల్ అవుతున్న పోస్టర్‌లో పేర్కొన్న వివరాలకు సంబంధించి అధికారిక ధృవీకరణ స్పష్టంగా లభించలేదు. ప్రజలు భయాందోళనలకు గురికాకుండా, ధృవీకరించని సమాచారాన్ని ఫార్వర్డ్ చేయకుండా పోలీసుల అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని అధికారులు కోరుతున్నారు.










