సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముట్టడి|

0
20

మంచిర్యాల జిల్లాలో సీఐటీయు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి, డీఈవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రైవేట్ సంస్థలు నాణ్యమైన భోజనం అందించడం లేదని ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కార్మికులకు రూ. 10,000 కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే, 60 ఏళ్లు పైబడిన కార్మికులను అకారణంగా తొలగించరాదని, ఒకవేళ తొలగిస్తే రూ. 2 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని యూనియన్ నాయకులు అబ్బోజు రమణ, రంజిత్ కుమార్, రాజారాం తదితరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.