క్షతగాత్రులను పరామర్శించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ – డా కడియాల లలిత్ సాగర్ గార్ల
దంపతులు.మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం.దర్శి నుంచి బోధనంపాడు దశదిన కర్మకు వెళ్తున్న సందువారిపాలెంకు చెందిన వారితో ఉన్న ఆటో టైరు పగిలి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు.
దర్శి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను టీడీపీ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ దంపతులు పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.
గాయపడిన ముగ్గురిని 108 అంబులెన్స్‌లో ఒంగోలు రిమ్స్‌కు తరలించగా, మిగిలిన వారికి దర్శి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స కొనసాగుతోంది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శ పట్టణ టిడిపి అధ్యక్షులు పుల్లలచెరువు సత్యనారాయణ, దర్శి మండల పార్టీ అధ్యక్షులు మారెళ్ళ వెంకటేశ్వర్లు సందువారిపాలెం ప్రజలు ఉన్నారు.










