ఆసిఫాబాద్ నూతన డీటీడీవో జాదవ్ అంబాజీకి ఘన సన్మానం|

0
3

ఆసిఫాబాద్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ నూతన అధికారి (డీటీడీవో)గా పదోన్నతిపై బాధ్యతలు స్వీకరించిన జాదవ్ అంబాజీని రాజ్ గోండ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. జాతీయ అధ్యక్షులు సిడెం అర్జు మాస్టర్ నేతృత్వంలో ఆయనకు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. గిరిజనుల సంక్షేమం, విద్యాభివృద్ధికి కృషి చేయాలని అర్జు మాస్టర్ ఈ సందర్భంగా కోరారు. అనంతరం డీటీడీవో అంబాజీ మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధి, ఆశ్రమ పాఠశాలల ప్రగతికి, సంక్షేమ పథకాల పకడ్బందీ అమలుకు అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. అందరి సహకారంతో గిరిజన సంక్షేమానికి మరింత కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కొమురం భీమ్ మునిమనమడు కుమరం మాధవరావ్, కుర్సెం మోతిరామ్, పీవీటీజీ రాష్ట్ర అధ్యక్షుడు భీంరావ్ తదితర గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.