మదనపల్లె, తిరుపతిలో కావేరి టెక్నాలజీస్ ఐటీ వర్క్‌షాప్|

0
1

మదనపల్లె: ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలను లక్ష్యంగా చేసుకుని కావేరి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో హ్యాండ్స్-ఆన్ వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. గత ఐదు సంవత్సరాలుగా బీటెక్, ఎంసీఏ, ఎంటెక్ తదితర విద్యార్థులకు నాణ్యమైన సాఫ్ట్‌వేర్ శిక్షణ అందిస్తూ, 200 మందికి పైగా విద్యార్థులను ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో విజయవంతంగా ప్లేస్‌మెంట్‌లు పొందేలా చేసిన అనుభవంతో ఈ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

 

ఈ వర్క్‌షాప్‌లో విద్యార్థులకు ప్రాక్టికల్ హ్యాండ్స్-ఆన్ ట్రైనింగ్, రియల్‌టైమ్ ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్ అవకాశాలు, మాక్ ఇంటర్వ్యూలు, రెజ్యూమ్ బిల్డింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాలపై సమగ్ర శిక్షణ అందించనున్నారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన సాఫ్ట్వేర్ Testing + Gen AI, Python + Gen AI, Java + Gen AI, Playwright + Gen AI (TypeScript, C#, JavaScript) వంటి ఆధునిక కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

 

శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రముఖ ఐటీ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా 100 శాతం ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ అందించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. మదనపల్లె, తిరుపతి కేంద్రాల ద్వారా ఈ శిక్షణ కార్యక్రమాలు అందుబాటులో ఉండనున్నాయని తెలిపారు. ఐటీ రంగంలో కెరీర్‌ను నిర్మించాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.