మానుకోట రైలు పట్టాలపై ఓ..ప్రాణం పోబోతుంది|

0
1

మహబూబాబాద్ రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు యత్నించిన ఓ యువకుడిని రూరల్ సీఐ అంజలి, ఎస్సై సుదర్శన్ మరియు పోలీస్ సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రక్షించారు.

బుధవారం తెల్లవారుజామున 2:44 గంటలకు డీజీ కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం అందుకున్న సీఐ అంజలి వెంటనే అప్రమత్తమయ్యారు. కటిక చీకటిలో సిబ్బందితో కలిసి ట్రాక్ వెంబడి గాలింపు చేపట్టారు. మణుగూరు ఎక్స్‌ప్రెస్ వేగంగా దూసుకొస్తున్న ఉత్కంఠభరిత సమయంలో, పట్టాలపై పడుకున్న ఇల్లందుకు చెందిన షేక్ వసీమ్ (26) అనే యువకుడిని రైలు కింద పడకుండా మెరుపు వేగంతో పక్కకు లాగి ప్రాణాలు కాపాడారు. అనంతరం అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసుల సమయస్ఫూర్తిని, సాహస చర్యను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ప్రత్యేకంగా అభినందించారు.