కనిగిరి తాగునీటి సమస్యపై మంత్రి నారాయణకు ఎమ్మెల్యే వినతి|

0
2

కనిగిరి నియోజకవర్గ ప్రజలను దశాబ్దాలుగా వేధిస్తున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి స్పష్టం చేశారు. ఒక బిందె నీటి కోసం కిలోమీటర్లు నడిచే తల్లులు, ఫ్లోరైడ్ నీటితో అనారోగ్యం పాలవుతున్న ప్రజల కష్టాలను తీర్చేందుకు సమగ్ర తాగునీటి ప్రాజెక్టును మంజూరు చేయాలని కోరుతూ.. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణకు ఆయన వినతిపత్రం అందజేశారు. స్వచ్ఛమైన తాగునీరు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని, ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించేలా ఈ ప్రాజెక్టును తీసుకురావడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే వివరించారు. ప్రజల దాహం తీరి, కనిగిరికి శాశ్వత పరిష్కారం దక్కే వరకు తన కృషి నిరంతరం కొనసాగుతుందని ఆయన ఉద్ఘాటించారు.