అమరావతిపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు|

0
2

అమరావతిని రాజధానిగా ఒప్పుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. మనకు ఇష్టమున్నా లేకున్నా అమరావతిని రాష్ట్ర రాజధానిగా అంగీకరించి తీరాల్సిందే” అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన ఆయన… భవిష్యత్ కార్యాచరణపై మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 

 

 

 

రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పి అభివృద్ధి సాధించడమే తమ లక్ష్యమని.. ఏపీని రూ. 12 లక్షల కోట్ల అప్పుల ఊబి నుంచి బయటపడేసేందుకే తమ కొత్త పార్టీ ఉద్భవిస్తోందని స్పష్టం చేశారు. కేవలం రెడ్డి, కమ్మ సామాజిక వర్గాల వారే సీఎం స్థానంలో ఉండాలా? ఆయన ప్రశ్నించారు. బీసీలతో సహా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తామని… తమ పార్టీలో ఏకంగా 66 శాతం ప్రాధాన్యత యువతకే ఇస్తామని హామీ ఇచ్చారు.