భారత్ అవాజ్ న్యూస్: 24 జూలై రోజున వరంగల్ జిల్లా గిర్ని బావి వద్ద దుగ్గొండి మండలం నీట్ పరీక్ష పేపర్ లీకేజీ నిరసనపై కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ సహా పలువురి అక్రమ అరెస్టులను నిరసిస్తూ దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చుక్క రమేష్ గారి ఆధ్వర్యంలో వరంగల్ కు వెళ్లే రహదారి గిర్నిబాయిలో శాంతియుత నిరసన తెలిపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల నిరసనలపై బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరి, నిరంకుశత్వాన్ని ఖండిస్తూ ధర్నా నిర్వహించారు.. వివిధ గ్రామ సర్పంచులు మరియు గ్రామ పార్టీ అధికారులు పాల్గొనడం జరిగింది… దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము










