శ్రీనివాసులు రెడ్డికి ఎమ్మెల్యే బండారు శ్రావణి స్వాగతం|

0
2

తెలుగుదేశం పార్టీ జోన్-5 ఇంచార్జ్ శ్రీ రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి గారికి ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు సాదర స్వాగతం

అనంతపురం విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జోన్-5 ఇంచార్జ్ శ్రీ రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి గారిని శింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు తన నివాసంలో మర్యాదపూర్వకంగా సాదర స్వాగతం పలికారు . ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు పూల నాగరాజు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు ఇతర ముఖ్య నాయకులు కూడా హాజరై సమావేశంలో పాల్గొన్నారు.

అనంతరం పార్టీ బలోపేతం, సంస్థాగత అభివృద్ధి, స్థానిక రాజకీయ పరిస్థితులు, శింగనమల నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలు మరియు భవిష్యత్ కార్యాచరణపై నాయకులు చర్చించారు.

అదేవిధంగా ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్న “ఇంటింటికి రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి మరియు సంక్షేమం” కార్యక్రమంపై సమగ్రంగా చర్చించారు. కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేసి ప్రజలకు వివరించేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు.

ఈ సమావేశంలో స్థానిక నియోజకవర్గానికి చెందిన పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.