మలివిడతలో 2,634మందికి పట్టాలు పంపిణీ చేసిన మంత్రి లోకేష్|

0
0

మంగళగిరిలో ‘మన ఇల్లు – మన లోకేష్’ కార్యక్రమంలో భాగంగా మంత్రి నారా లోకేష్ రెండో విడతలో 2,634 మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. వరుసగా రెండో రోజు కూడా ఆయన ఆరు గంటలపాటు వేదికపై నిలబడే లబ్ధిదారులకు పట్టాలు, నూతన వస్త్రాలు అందించడం విశేషం. ఈ పట్టాల మార్కెట్ విలువ సుమారు రూ.1000 కోట్లు ఉంటుంది. దివ్యాంగుల వద్దకు స్వయంగా కిందకు వెళ్లి పట్టాలు అందజేశారు. వివిధ ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పేదలకు పట్టాలు ఇస్తానన్న తన ఎన్నికల హామీని మంత్రి లోకేష్ ఈ విధంగా నెరవేరుస్తున్నారు. మిగిలిన భూముల సమస్యల పరిష్కారానికి సైతం ఆయన రాష్ట్ర ఉన్నతాధికారులు, కేంద్ర పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారు.