ఆసిఫాబాద్ పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నితికా పంత్ తనిఖీలు|

0
1

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నితికా పంత్ వార్షిక తనిఖీలు నిర్వహించారు. రికార్డులు, కేసు ఫైళ్లను పరిశీలించిన ఆమె అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా పోక్సో, గ్రేవ్ కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు చేయాలని, దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులను వేగవంతంగా పరిష్కరించాలని సూచించారు. కార్యాలయాల్లో ఫైళ్ల నిర్వహణకు ‘5S’ విధానాన్ని అమలు చేయాలన్నారు. జిల్లాలో గంజాయి రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని, అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలపై కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజల్లో అవగాహన పెంచాలని, గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.