తెలంగాణ పౌర సరఫరాల శాఖలో ధాన్యం టెండర్ల రద్దుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియకుండానే సీఎం రేవంత్ రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించడం రాజకీయ దుమారం రేపుతోంది. గత ఖరీఫ్ సీజన్లో మిగిలిన 12 లక్షల టన్నుల ధాన్యం వేలానికి గ్లోబల్ టెండర్లు పిలవగా, బిడ్డర్లు తక్కువ ధర కోట్ చేయడంతో ఉత్తమ్ వాటిని రద్దు చేశారు. అయితే, తక్కువ ధర ఎందుకు కోట్ చేశారనే దానిపై రేవంత్ విచారణకు ఆదేశించారు. ఈ విషయం పత్రికల ద్వారా తెలుసుకున్న ఉత్తమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన శాఖలో తనకే తెలియకుండా ఎంక్వైరీ చేయించడంపై అధికారులపై మండిపడ్డారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే రేవంత్ కుట్ర చేస్తున్నారని, తన శాఖపై ఆయన పెత్తనం ఏంటని సన్నిహితుల వద్ద ఉత్తమ్ ఆవేదన వ్యక్తం చేశారు.










