మదనపల్లెలో ప్లాస్టిక్ వాడకంపై భారీ అవగాహన ర్యాలీ|

0
3

మదనపల్లెలో ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. మాస్టర్ మురళి నేతృత్వంలో కదిరి రోడ్డు నుండి బెంగళూరు బస్ స్టాండ్ వరకు సాగిన ఈ ర్యాలీని జీవీఆర్ టవర్స్ యజమాని ఆవుల వెంకటరమణ జెండా ఊపి ప్రారంభించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించడం, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టకపోతే భావితరాలు తీవ్ర ఇబ్బందులు పడతాయని, ప్లాస్టిక్ పాత్రల్లో వేడి ఆహారం, నీటిని తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో హానికరమని మాస్టర్ మురళి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కరాటే విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.