ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై రోడ్డు అధ్వానం |

0
1

సీతానగరం ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై రహదారిపై పెద్ద పెద్ద గోతులతో అధ్వానంగా ఉండటంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ బ్రిడ్జిపై నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.

గతంలో గోతులలో పడి ప్రమాదాలు జరిగే సందర్భాలు అనేకం ఉన్నాయి. వర్షాలకు గోతులు నీరు చేరి వాహనదారులకు గోతులు కనబడని కారణంగా మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు వాపోతున్నారు.