కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ఎంపీ వంశీకృష్ణ, వివేక్ భేటీ|

0
0

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, తెలంగాణ గనుల శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాడిచెర్ల-2 బొగ్గు గని ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి, స్థానిక యువతకు సుమారు 1000 ఉద్యోగాలు కల్పించాలని వారు కేంద్ర మంత్రిని కోరారు. అలాగే నిర్వాసితులకు R&R ప్యాకేజీ కింద సమగ్ర పునరావాసం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి సంస్థలో పదవీ విరమణ పొందిన కార్మికులకు కనీస పెన్షన్‌ను ₹10,000 కు పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సింగరేణి అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై చర్చించారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించి, సంబంధిత శాఖలతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.