మదనపల్లె, జూలై 26: ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇటీవల ఉదర శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తిచేసుకుని ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నట్లు స్వయంగా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించిన నేపథ్యంలో, అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు షేక్ రెడ్డి సాహెబ్ ఆమె త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా షేక్ రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ, వైఎస్ షర్మిల ఆరోగ్యం కుదుటపడుతోందన్న వార్త పార్టీ శ్రేణులకు, అభిమానులకు ఆనందాన్ని కలిగించిందన్నారు.
ఆమె ధైర్యసాహసాలతో శస్త్రచికిత్సను విజయవంతంగా ఎదుర్కొని, సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
వైఎస్ షర్మిలకు భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఆమె త్వరగా కోలుకుని కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ నాయకులకు ఆనందాన్ని కలిగించాలని ఆకాంక్షించారు.










