ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అధికారులకు విన్నవించడం జరిగింది|

0
2

కోసిగి మండల కేంద్రంలోని సమీకృత బాలుర వసతి గృహాన్ని (ఇంటిగ్రేటెడ్ హాస్టల్) అక్కడే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ నాయకులు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న ఎస్సీ, బీసీ హాస్టళ్లను ప్రస్తుత కూటమి ప్రభుత్వం గురుకుల పాఠశాలల పేరుతో మూసివేసేందుకు ప్రయత్నిస్తోందని ఏఐఎస్ఎఫ్ నాయకులు సోమన్న, ఈరేష్ విమర్శించారు. వార్డెన్లు విద్యార్థులను హాస్టల్ నుండి బలవంతంగా పంపించేస్తున్నారని, ఉన్నతాధికారులు దీనిపై స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని హాస్టల్‌ను కోసిగిలోనే కొనసాగించకపోతే, ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించి నిరాహార దీక్షలు చేపడతామని వారు ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు.