తెలంగాణలో వాన జోరు.. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు|

0
1

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. మంచిర్యాల జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 46 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, నీటి నిల్వ 12.88 టీఎంసీలకు చేరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాలిపేరు ప్రాజెక్టు 24 గేట్లు, కొమురం భీం జిల్లా వట్టివాగు ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

మరోవైపు, జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో పుష్కర ఘాట్లు నీటమునిగాయి. అనంతారం బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. మంచిర్యాల జిల్లాలోని ఇందారం, శ్రీరాంపూర్, కల్యాణి ఖని సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో రోజుకు 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తితో పాటు మట్టి వెలికితీత పనులు పూర్తిగా నిలిచిపోయాయి.