వాజ్‌పేయి నగర్ యువత.. బీఆర్ఎస్‌లో చేరిక.|

0
17

● మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి సమక్షంలో గులాబీ కండువా

● ప్రజా సంక్షేమమే పార్టీ లక్ష్యమని ఎమ్మెల్యే వ్యాఖ్య

● చేరిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందని హామీ

మేడ్చల్ మల్కాజ్‌గిరి, జూలై 31: వినాయక్‌నగర్ డివిజన్ పరిధిలోని వాజ్‌పేయి నగర్‌కు చెందిన పలువురు యువకులు శుక్రవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరారు.

జక్కుల కిరణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్తగా చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు.

ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధే పార్టీ లక్ష్యమని పేర్కొన్న ఆయన, ప్రజాసేవా కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, యువత స్వచ్ఛందంగా బీఆర్ఎస్‌లో చేరుతున్నారని అన్నారు.

పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, బాధ్యతలు కల్పిస్తామని, పార్టీ బలోపేతానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

చేరిన వారిలో నర్సింగ్ ముదిరాజ్, శ్యామ్, ప్రసాద్, రాజేష్, ఉమేష్, సుమేత్, యశ్వంత్, వెంకటేష్ యాదవ్, సాయిరామ్ సింగ్, నవీన్ కుమార్ తదితరులు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో జేఏసీ వెంకన్న, జక్కుల కిరణ్, శ్రీకాంత్ యాదవ్, శ్రీధర్, విజయ్ రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal