● ‘డా. మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’గా నామకరణం
● సైనేజీ, అధికారిక వినియోగంలో కొత్త పేరును అమలు చేయాలని ఉత్తర్వులు
● చట్టంలోని సంస్థ అసలు పేరు మాత్రం యథాతథంగా కొనసాగుతుందని స్పష్టీకరణ
హైదరాబాద్, జూలై 31: సనత్‌నగర్‌లోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS)కు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పేరు పెడుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ గురువారం విడుదల చేసిన జీఓ ఎంఎస్ నెం.63 ప్రకారం, ఇకపై ఈ సంస్థను ‘డా. మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, సనత్‌నగర్’ పేరుతో సైనేజీ, ప్రజా వినియోగం, పరిపాలనా అవసరాల్లో పేర్కొనాలని నిర్ణయించింది.
అయితే, తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చట్టం–2024 ప్రకారం ఉన్న సంస్థ అధికారిక (Statutory) పేరు మాత్రం ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్. చోంగ్తు పేరుతో ఉత్తర్వులు వెలువడ్డాయి.
#Sidhumaroju










