పలాస మండలం, బొడ్డపాడు పంచాయతీ పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి బమ్మిడి దుర్యోధనరావు (బి.డి. రావు), ఎంపీటీసీ అభ్యర్థి బుడత ధనరాజు గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు అభ్యర్థులకు బొట్టు పెట్టి, పూలు చల్లి ఘన స్వాగతం పలికారు. ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన అభ్యర్థులు, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తమను ఆశీర్వదించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పలాస మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










