కాలనీ కష్టాలపై కదిలిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|

0
13

● భీంరావ్ నగర్‌లో పర్యటించిన మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి

● దెబ్బతిన్న రహదారులు, వీధి దీపాలు, చెట్ల కొమ్మల సమస్యల పరిశీలన

● త్వరితగతిన పరిష్కారం చూపిస్తామని స్థానికులకు హామీ

మేడ్చల్ మల్కాజ్‌గిరి, ఆగస్టు 1: మల్కాజ్‌గిరి నియోజకవర్గ పరిధిలోని ఆల్వాల్, భీంరావ్ నగర్‌లో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పర్యటించి స్థానికులతో మమేకమయ్యారు.

కాలనీలోని పలు ప్రాంతాలను పరిశీలించిన ఆమె, దెబ్బతిన్న రహదారులు, వీధి దీపాల కోసం విద్యుత్ స్తంభాల ఏర్పాటు, చెట్ల కొమ్మల తొలగింపు అవసరాన్ని స్థానికుల నుంచి తెలుసుకున్నారు.

సంబంధిత సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని శాంతి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గిరి, లింగారెడ్డి, సాజిద్, మహేందర్, మనీష్‌తో పాటు స్థానికులు పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal