● రాజీవ్ గాంధీ నగర్‌లో చౌక ధరల దుకాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
● స్థానికుల విజ్ఞప్తికి సానుకూల స్పందనతో అందుబాటులోకి సేవలు
● వృద్ధులు, మహిళలు, నిరుపేద కుటుంబాలకు ఇకపై సౌలభ్యం
మల్కాజ్‌గిరి, ఆగస్టు 1: మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని, ఆల్వాల్.. వెంకటాపురం డివిజన్, కానాజీగూడ రాజీవ్ గాంధీ నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన చౌక ధరల దుకాణాన్ని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానికులు ఎన్నో ఏళ్లుగా తమ ప్రాంతంలో రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలని కోరుతున్నారని అన్నారు.
ప్రజల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని పౌర సరఫరాల శాఖ అధికారులతో సమన్వయం ఫలితంగానే ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు రేషన్ సరుకుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, నిరుపేద కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొనేవారని చెప్పారు.
ఇకపై తమ ప్రాంతంలోనే నిత్యావసర సరుకులు పొందే అవకాశం కలగడంతో లబ్ధిదారుల సమయం, శ్రమ రెండూ ఆదా అవుతాయని వివరించారు.
కొత్త చౌక ధరల దుకాణం అందుబాటులోకి రావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో..మాజీ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్, రేషన్ డీలర్ సంజీవరావు, బీఆర్ఎస్ నాయకులు, శ్రీధర్ గౌడ్, డోలి రమేష్, సయ్యద్ మోసిన్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
#Sidhumaroju
Alwal










