ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో పాల్గొన్న..మంత్రి మండిపల్లి|

0
4

రాయచోటిలో ‘ఇంటింటికీ టీడీపీ’: సంక్షేమ పథకాలను వివరించిన మంత్రి మండిపల్లి

అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపాలిటీ 25, 26వ వార్డుల్లో నిర్వహించిన ‘ఇంటింటికీ టీడీపీ – రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి-సంక్షేమం’ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. టీడీపీ శ్రేణులతో కలిసి ఆయన గడపగడపకూ వెళ్లి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. “ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి కుటుంబానికి సంక్షేమం” లక్ష్యంగా పారదర్శక పాలన అందిస్తున్నామని, ప్రజల ఆదరణే తమ బలమని ఆయన ఉద్ఘాటించారు.