ఇంటింటికి తెలుగుదేశం: కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రచారం
రాజంపేట నియోజకవర్గ తెదేపా ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు వీరబల్లె మండలంలో “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమాన్ని ప్రారంభించారు. “రెండేళ్ల నమ్మకం – సంక్షేమం అభివృద్ధి” అనే నినాదంతో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఆయన ప్రజలకు వివరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అమరావతి అభివృద్ధి వేగవంతమైందని, పెరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నా క్యాంటీన్ల ద్వారా ₹5లకే భోజనం, దీపం పథకం కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని తెలిపారు. గత వైకాపా ప్రభుత్వంలా కాకుండా.. ‘తల్లికి వందనం’ ద్వారా ఇంట్లోని పిల్లలందరికీ సాయం, రైతులకు ‘అన్నదాత సుఖీభవ’, ఆటో డ్రైవర్లకు ₹15,000 సాయం, చేనేతలకు ఉచిత విద్యుత్ వంటి పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని, అర్హులందరికీ ఈ ఫలాలు దక్కేలా బాధ్యత తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.










