నాకు, సీఎం కి మధ్య గ్యాప్ లేదు..సీఎం నేను రోజూ ఫోన్లో మాట్లాడుకుంటాం
మేం ముఖ్యమంత్రిని గౌరవిస్తాం,పార్టీ, ప్రభుత్వం వేరు వేరు కాదు
రేవంత్ రెడ్డి మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి
నాకు, సీఎం కి మధ్య గ్యాప్ లేదు, సీఎం నేను రోజూ ఫోన్లో మాట్లాడుకుంటాం,నిన్న కూడా సీఎం తో ఫోన్ మాట్లాడాను
నా ఆడియోలు వీడియోలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు
దమ్ముంటే నా ఆడియోలు, వీడియోలు బయట పెట్టండి,సీఎంకు, నాకు మంచి సఖ్యత ఉంది, దొంగ చాటున ఫిర్యాదులు చేసుకునే అవకాశం కాంగ్రెస్ లో లేదు
ఏమున్నా మేం మొహంపైనే మాట్లాడుకుంటాం
బయట జరుగుతున్న విషయాలను చర్చించుకుంటాం
కో ఆర్డినేషన్ కమిటీలో కీలక చర్చ జరిగింది
ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాంలు కో ఆర్డినేషన్ కమిటీలో చర్చిస్తే బాగుంటుందని అనుకున్నాం
అందరం చర్చిస్తే మంచి నిర్ణయాలు తీసుకోగలమని అనుకున్నాం
కో ఆర్డినేషన్ కమిటీకి అన్ని చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రికి లేదు,అందరం ఓపెన్ గానే మాట్లాడుకున్నాం
కో ఆర్డినేషన్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం
మీరు ఫోటోలో చూస్తే వంశీ మధ్యలో కూర్చున్నట్టు అనిపిస్తోంది
ప్రోటోకాల్ ప్రకారం మీనాక్షీ నటరాజన్ సమీక్ష నిర్వహించారు
టేబుల్ ఓవెల్ షేప్ లో ఉంది కాబట్టి అందరూ పొరబడుతున్నారు










