Madanapalle: మదనపల్లె, ఆగస్టు 7: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర ఆధ్వర్యంలో గురువారం మదనపల్లెలో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు చేనేత కార్మికులు, కూటమి నాయకులతో కలిసి ర్యాలీగా వెళ్లి జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సబ్ కలెక్టర్‌తో పాటు చేనేత శాఖ ఏడీని కలిసి చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు, చేనేత కార్మికులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొని చేనేత కార్మికుల సంక్షేమం, చేనేత రంగ పరిరక్షణకు కృషి చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.










