రూ.98 కోట్లతో గూడెం, విశ్వనాథ ఆలయాల అభివృద్ధి: ఎమ్మెల్యే|

0
1

మంచిర్యాలలోని నార్తిన్ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. రూ.98 కోట్లతో దండేపల్లి మండలంలోని గూడెం సత్యనారాయణ స్వామి, మంచిర్యాలలోని శ్రీ విశ్వనాథ ఆలయాల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. వచ్చే శ్రావణమాసం నాటికి పనులు ప్రారంభించి, పుష్కరాల సమయానికి పూర్తి చేస్తామన్నారు. రెండో అన్నవరంగా పేరుగాంచిన గూడెం ఆలయాన్ని ఆగమశాస్త్ర ప్రకారం అభివృద్ధి చేస్తామని, ఒకేసారి వెయ్యి జంటలు వ్రతాలు చేసుకునేలా భారీ మండపాలు, పుష్కర ఘాట్లు, భక్తులకు వసతులు, బోటింగ్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఆలయాల పునర్నిర్మాణ డిజైన్లను ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు సురేఖ, మేయర్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు.