ఆసిఫాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత పోలీస్ కోచింగ్|

0
404

తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ నేపథ్యంలో, ఆసిఫాబాద్ జిల్లా నిరుద్యోగ యువతకు ఎస్పీ నితికా పంత్ గుడ్‌న్యూస్ చెప్పారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 3 నెలల పాటు ఉచిత వసతి, భోజన సదుపాయాలతో కూడిన రెసిడెన్షియల్ పోలీస్ కోచింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 7,437 ఉద్యోగాలకు గానూ జిల్లాకు 139 పోస్టులు కేటాయించారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు ఈ శిక్షణకు అర్హులు. అర్హులను ఎంపిక చేసేందుకు ఆగస్టు 15న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఎంపికైన వారికి నిపుణులతో శిక్షణ ఇస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ ఇంటర్ మెమోతో వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.