విద్యుత్ ప్రమాదం లో మరణించిన జెన్కో కాంట్రాక్ట్ కార్మికుడు :చింతూరు|

0
0

చింతూరు మండలం మోతూగూడెం జెన్కో లో మంగళవారం ప్రమాదవశత్తు విద్యుత్ ఘాతం తో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి. జెన్కో లో  కాంట్రాక్టు కార్మికుడు మడివి ముత్తయ్య (గూడూరు )విధి నిర్వహణలో కరెంటు షాక్ తో చనిపోవడం జరిగింది. పై అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఇది జరిగిందని చెప్పి సిఐటియు ఆధ్వర్యంలో నాలుగు గంటల పాటు ఆందోళన నిర్వహించడం జరిగింది. ఆందోళనతో దిగివచ్చిన అధికారులు కుటుంబానికి నష్టపరిహారంగా 27 లక్షలు రూపాయలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, బాధ్యుల పైన తక్షణ చర్యలకు డిమాండ్ చేయడం జరిగింది. మృతుని తరుపున డిమాండ్లకు అంగీకరిస్తూ లిఖితపూర్వకంగా జన్కో అధికారులు CE, SE గార్లు హామీ పత్రం రాసి ఇవ్వడం జరిగింది.

 

# Yadagiri