ఈ రోజు రాజీవ్ కళ్యాణమండపం , బాజిజంక్షన్ నందు 52, 89, 90 ,91 ,92 వార్డుల్లో లబ్ధిదారులకు శాశ్వత రిజిస్ట్రేషన్ ఆస్తి పత్రాలు అందజేసిన ప్రభుత్వ విప్ శ్రీ గణబాబు గారు

0
1

“పేదలకు పట్టాభిషేకం – మీ ఇల్లు మీ హక్కు” కార్యక్రమంలో భాగంగా, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 52 , 89 , 90 ,91 ,92 వార్డులకు చెందిన లబ్ధిదారులకు శాశ్వత రిజిస్టర్డ్ ఆస్తి పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. 91వ వార్డు రాజీవ్ కళ్యాణమండపం , బాజిజంక్షన్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యాలయంలో విశాఖపట్నం పశ్చిమ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు ముఖ్య అతిథిగా పాల్గొని, మొత్తం 200 మంది లబ్ధిదారులకు అధికారిక రిజిస్టర్డ్ ఆస్తి పత్రాలను స్వయంగా అందజేశారు.

 ​ఈ సందర్భంగా గణబాబు గారు మాట్లాడుతూ, గతంలో ఇచ్చిన పట్టాల మాదిరిగా కాకుండా, కూటమి ప్రభుత్వం అధికారిక సబ్-రిజిస్ట్రార్ ముద్రతో సంపూర్ణ హక్కులు కల్పిస్తూ రిజిస్టర్డ్ కన్వేయెన్స్ డీడ్స్ అందిస్తోందని తెలిపారు. పేద ప్రజలు దశాబ్దాలుగా నివాసముంటున్న స్థలాలపై చట్టబద్ధమైన యాజమాన్య హక్కులు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ పత్రాల ద్వారా బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు పొంది పిల్లల ఉన్నత చదువులకు, కుటుంబ ఆర్థిక పురోగతికి వినియోగించుకోవచ్చని, ఈ ఆస్తులు భావితరాలకు పటిష్టమైన ఆర్థిక భరోసాగా నిలుస్తాయని వివరించారు.

 ​ఈ కార్యక్రమంలో గోపాలపట్నం తాసిల్దార్ Ch.v.రమేష్ గారు విశాఖ వెస్ట్ జోనల్ కమిషనర్ హేమావతి గారు , రెవెన్యూ అధికారులు,సిబ్బంది స్థానిక వార్డుల ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు ,కార్యకర్తలు , మరియు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు మొదలగున్నవారు పాల్గొన్నారు.