పంటలు దెబ్బతింటున్నాయంటూ రైతుల ఆందోళన రైతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

0
1

🎯పరిటాల క్వారీ ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత

ఎన్టీఆర్ జిల్లా : కంచికచర్ల మండలంపరిటాల గ్రామ శివారులో కొత్త క్వారీ, క్రషర్లకు అనుమతులు, పాత వాటి పొడిగింపుపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్వారీలు, క్రషర్ల నుంచి వెలువడే దుమ్ము, ధూళి కారణంగా పంటలు దెబ్బతింటున్నాయని రైతులు అధికారులు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రైతులు అధికారులను ప్రశ్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పలువురు రైతులను అదుపులోకి తీసుకుని నందిగామ పోలీస్‌ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. మహిళా రైతులను కూడా పోలీసులు నెట్టివేశారని రైతులు ఆరోపిస్తూ, తమకు న్యాయం చేయాలని కోరారు.