వైసీపీ మంత్రి లోకేష్ పై నిందలు మానుకోవాలి. కసినేని మహేంద్రా నాయుడు|

0
0

 

 

టీడీపీ క్యాంపు కార్యాలయం

మాధవరం గ్రామం

రాయచోటి మండలo

రాయచోటి నియోజకవర్గం

 

డీఎస్సీ నియామకాల అంశాన్ని రాజకీయ విమర్శలకు వేదికగా మార్చకుండా, నిరుద్యోగ యువత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఐటీడీపి రాయచోటి నియోజకవర్గ నాయకులు కసినేని మహేంద్ర నాయుడు కోరారు. డీఎస్సీ పేరుతో వైసీపీ నాయకులు నిర్వహిస్తున్న ర్యాలీలపై ఆయన స్పందిస్తూ, నిరుద్యోగ యువత భవిష్యత్తు ఎంతో ముఖ్యమైనదని, డీఎస్సీ విషయంలో అభ్యర్థుల్లో అనవసర ఆందోళనలు కలిగించే ప్రచారానికి దూరంగా ఉండాలని అన్నారు. తరగతి గదిలో పాఠాలు చెప్పే గురువులు… జిత్తులమారి జగన్ కు గుణపాఠం చెప్పడానికి కర్నూలు కొండారెడ్డి బురుజు ఎక్కారు..అభ్యర్థులు ప్రభుత్వం, సంబంధిత శాఖలు విడుదల చేసే అధికారిక ప్రకటనలను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 

*చంద్రబాబు–లోకేష్ నాయకత్వంలో యువతకు ప్రాధాన్యత*

 

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, పవన్ కల్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్య, ఉపాధి, యువతకు అవకాశాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

డీఎస్సీ అభ్యర్థులు ఎలాంటి అపోహలకు గురికాకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కసినేని కోరారు