యాదాద్రికి దీటుగా నిర్మాణం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రగల్భాలు..
సిమెంట్.. కాంక్రీట్ తో నిర్మాణాలు.. బయట పడుతున్న లోపాలు.
దిగజారుతున్న ఆలయ ప్రతిష్ట.. ప్రాశస్థ్యత..
చుట్టూ కట్టడాలతో కనిపించకుండా పోతున్న ప్రధాన గర్భాలయ గోపురం.
ఆలస్యంగా గుర్తించి ఆలోచనలోపడ్డ అధికారులు..
తప్పును కప్పిపుచ్చుకునేందుకు విస్తరణ పేరిట తెరపైకి కొత్త ప్రతిపాదనలు.
ఏకంగా గర్భాలయం ఎత్తుతోపాటు.. విస్తరించడానికి కొత్త ప్రతిపాదనలను తెరపైకి తెచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.
అందుకోసం ఈనెల 12న శృంగేరి పీఠాధిపతిని కలిసేందుకు బృందం వెళ్తున్నట్టు తెలియడం చర్చనీయాంశమైంది.
విస్తరణ పనుల్లో ఇష్టారాజ్యంపై భక్తుల తీవ్ర అసంతృప్తి.
వీటన్నింటినీ నిశితంగా పరిశీలిస్తే.. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని తెలుస్తుండగా.. ఆలయ నిర్మాణ తీరు భక్తులను ఆందోళనకు గురి చేస్తున్నది.










