🎤ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్:
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ ఎక్స్‌రోడ్ వద్ద ఆదివారం పోలీసులు విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఎస్సై శ్యాంరావు గారి ఆధ్వర్యంలో సిబ్బంది వాహనదారులను ఆపి బ్రీత్ అనలైజర్ పరీక్షలు జరిపారు.ఈ సందర్భంగా ఎస్సై శ్యాంరావు మాట్లాడుతూ. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రాణాలకే కాకుండా ఎదుటివారి ప్రాణాలకు కూడా ముప్పని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని ఆయన కోరారు.









