చింతూరు సబ్‌డివిజన్ పరిధిలో నిలిచిపోయిన వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలను వెంటనే పునరుద్ధరించాలని ఆటో కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆటో యూనియన్ సభ్యులు ఎంవిఐ చల్లారావును కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ… చింతూరులో ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించకపోవడంతో నాలుగు మండలాలకు చెందిన ఆటో కార్మికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిట్‌నెస్ సర్టిఫికేట్ కోసం దాదాపు 280 కిలోమీటర్లు ప్రయాణించి రాజమండ్రి వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. దీనివల్ల అదనపు ఇంధన ఖర్చులతో పాటు రోజంతా సమయం వృథా అయి ఉపాధి కోల్పోతున్నామని వాపోయారు. ఏజెన్సీ ప్రాంతంలోని వాహనదారుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, గతంలో మాదిరిగానే చింతూరు సబ్‌డివిజన్‌లోనే క్రమం తప్పకుండా ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వారు ప్రజాప్రతినిధులను, సంబంధిత రవాణా శాఖ ఎంవిఐ మరియు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు, స్థానిక వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.
# Yadagiri










