🎤భారత్ ఆవాజ్ న్యూస్, ఆసిఫాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పోలీస్ శాఖలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి ఘన సత్కారం లభించింది.
విధి నిర్వహణలో అత్యంత క్రమశిక్షణ, అంకితభావంతో సేవలందించి విశేష ప్రతిభ కనబరిచిన 33 మంది పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని గుర్తించి, వారికి జిల్లా ఎస్పీ నితికా పంత్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ వేడుకల అనంతరం అక్కడకు విచ్చేసిన చిన్న పిల్లలకు, పోలీస్ సిబ్బందికి మిఠాయిలను పంపిణీ చేశారు.
ఈ అధికారిక కార్యక్రమంలో ఎస్పీ నితికా పంత్‌తో పాటు అడిషనల్ ఎస్పీ చిత్రరంజన్, డీఎస్పీలు అశోక్, వహీదుద్దీన్ మరియు ఇతర ఉన్నతాధికారులు, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










