🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్) కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అందరూ కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతు . దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహనీయుల త్యాగాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ దేశ ప్రగతికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని ఒకరికొకరు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.










