🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్): కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బీసీ మహిళల స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి నదీమ్ ఖుద్దుసి తెలిపారు.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే మహిళల వయస్సు 18 నుండి 55 ఏళ్ల లోపు ఉండాలి. అలాగే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి, వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షల లోపు ఉండాలని స్పష్టం చేశారు. ఈ పంపిణీలో పేద, వితంతువు, మరియు ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.అర్హత ఉన్న జిల్లా మహిళలు సెప్టెంబరు 15వ తేదీ లోపు TGOBMMS పోర్టల్లో ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించుకోవాలని అధికారులు సూచించారు.









