రూ.42కే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులు!

0
1

AP: డ్రైవింగ్‌ లైసెన్స్, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ కార్డులను అతి తక్కువ ధరకే జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రోస్‌మెర్టా టెక్నాలజీస్‌ సంస్థ ఒక్కో కార్డుకు రూ.42.26 చొప్పున టెండర్‌లో ఖరారు కావడంతో త్వరలోనే కార్డుల తయారీ, పంపిణీ ప్రారంభం కానుంది.

ముందుగా 2024 అక్టోబర్ నుంచి 2026 ఆగస్టు వరకు కార్డులు ప్రింట్ చేసి వాహనదారులకు పంపిణీ చేస్తారు. కార్డు ముద్రణ నుంచి దరఖాస్తుదారుడి ఇంటికి చేరే వరకు కాంట్రాక్టర్‌దే బాధ్యతగా నిబంధనలు విధించారు.