చింతూరు డివిజన్ కేంద్రంగా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటు చెయ్యాలి!

0
3

చింతూరు డివిజన్ కేంద్రంగా చింతూరులో ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్ట్ (క్రిమినల్ ) మరియు పర్మినెంట్ మొబైల్ కోర్ట్ (సివిల్ ) ఏర్పాటు చేయాలని విలీన మండలాల న్యాయవాదుల సంఘం బుధవారం న చింతూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో తీర్మానించడం జరిగింది. ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు మరియు పర్మనెంట్ మొబైల్ కోర్టు ఏర్పాటు కోసం విలీన మండలాల్లో అన్ని రాజకీయ పక్షాల తో మరియు ఆదివాసి సంఘాలతో కూర్చొని మాట్లాడుకుని అన్ని రాజకీయ పక్షాల వాళ్లను ఆదివాసి సంఘాలను భాగస్వాములుగా చేసి కోర్ట్ ను సాధించాలని తీర్మానించడం జరిగింది . దీనిలో భాగంగా శనివారం నాడు v.r. పురం,కూనవరం మండలాలలో వివిధ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయటం ఆదివారం నాడు ఎటపాక చింతూరు మండలంలో వివిధ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయటం ఆ సమావేశం రాజకీయ పక్షాల అభిప్రాయం తీసుకోవటం ఆ అభిప్రాయాలు అన్నిటిని క్రోడీకరిస్తూ సంబంధిత అధికారులు అనగా జిల్లా జెంట్స్ హైకోర్టు ప్యానల్ జెంట్స్ ఆంధ్రప్రదేశ్ న్యాయ శాఖ మినిస్టర్ మరియు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు వారి నారా చంద్రబాబునాయుడు గారికి వినతులు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది . ఈ కార్యక్రమంలో గౌరవ భద్రాచలం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొడాలి శ్రీనివాస్ రావు గారు పాల్గొని విలీన మండలాల న్యాయవాదుల సంఘానికి మద్దతు తెలుపుతూ మీ పోరాటానికి నా పూర్తి సహకారం ఉంటుందని తెలియజేయడం జరిగింది . అలానే రంపచోడవరం బార్ అసోసియేషన్ యొక్క సహకారం కూడా తీసుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కోరడం జరిగింది . రంపచోడవరం సీనియర్ న్యాయవాది సుక్క సంతోష్ కుమార్ పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో విలీన మండలాల న్యాయవాదుల సంఘం కన్వీనర్: ఇల్లా చిన్నారెడ్డి కో- కన్వీనర్లు ధర్ముల లక్ష్మీనారాయణ,ఈసంపల్లి శ్రీనివాసరావు,సీనియర్ నాయకులు ఆవులూరి సత్యనారాయణ, పి నాగరాజ్ మోసం సంజీవరావు,మడివి రవితేజ, సోయం దుర్గ కామేష్, కే. రాంబాబు మల్లికార్జునరావు ప్రతాప్ ప్రవీణ్ తదితరులు పాల్గొనడం జరిగింది.

 

# Yadagiri