పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం

0
2

నందిగామ అక్టోబర్ 2 భారత్ అవాజ్ : స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు పట్టణ పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. శాలువాలతో సత్కరించి, పండ్లు అందజేశారు.

ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల సేవలను బీజేపీ నాయకులు కొనియాడారు. తెల్లవారుజామునే విధులకు హాజరై పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్న వారి సేవలు వెలకట్టలేనివని అన్నారు. స్వచ్ఛ భారత్‌లో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.