గుండెపోటుతో APSRTC బస్సు డ్రైవర్ మృతి|

0
0

సాలూరు APSRTC డిపో డ్రైవర్ అక్కెన శంకరరావు గుండెపోటుతో బుధవారం మృతి చెందారు. ఉదయం విధులకు వచ్చిన ఆయన విజయనగరం వెళ్లారు. తిరిగి వచ్చాక విశ్రాంతి సమయంలో కుప్పకూలిపోయారు. తోటి సిబ్బంది వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

#RAJESH