భూపాలపల్లి జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ నిల్వలపై పౌర సరఫరాల శాఖ అధికారులు దాడులు నిర్వహించి, సుమారు 444.75 క్వింటాళ్ల PDS బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేగొండ మండల కేంద్రంలోని పాత రైస్ మిల్ గోదాములో ఈ అక్రమ నిల్వలను గుర్తించినట్లు సివిల్ సప్లై అధికారులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి రైస్ మిల్ యజమానితో పాటు వాహన డ్రైవర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిమిత్తం పోలీసులకు అప్పగించారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న ప్రధాన నిందితులు మరియు ఇతర సరఫరాదారుల కోసం అధికారులు విస్తృతంగా గాలిస్తున్నారు.










