● డ్రైనేజీ ఇబ్బందులపై స్థానికుల విజ్ఞప్తికి తక్షణ స్పందన
● క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ.
అల్వాల్,అక్టోబర్ 5: మచ్చ బొల్లారం డివిజన్ సాయిబాబా నగర్ కాలనీలోని రోడ్ నంబర్ 8/Bలో డ్రైనేజీ ఇబ్బందులపై స్థానికుల విజ్ఞప్తికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతల మాణిక్యరెడ్డి తక్షణమే స్పందించారు.
సోమవారం నేరుగా కాలనీకి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా మురుగు పారుదలతో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
సమస్య తీవ్రతను గుర్తించిన మాణిక్యరెడ్డి.. త్వరితగతిన పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తమ విజ్ఞప్తికి వెంటనే స్పందించి క్షేత్రస్థాయికి వచ్చినందుకు రోడ్ నంబర్ 8/B నివాసితులు, కమిటీ సభ్యులు మాణిక్యరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
#Sidhumaroju
Alwal









