కొనసాగుతున్న నిరాహార దీక్షలు.|

0
9

● అల్వాల్ జేఏసీ చైర్మన్ పటోళ్ల సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు

● 19వ రోజు దీక్షలో అంబర్‌పేట విద్యార్థి నాయకులు నిఖిల్, శేరపల్లి మల్లేష్.

అల్వాల్, అక్టోబర్ 5: తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కాలయాపన చేయకుండా తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు 19వ రోజుకు చేరుకున్నాయి. 

అల్వాల్ జేఏసీ చైర్మన్ పటోళ్ల సురేందర్ రెడ్డి నాయకత్వంలో దీక్షలు కొనసాగుతున్నాయి.

19వ రోజు నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో అంబర్‌పేట నియోజకవర్గ విద్యార్థి నాయకులు నిఖిల్, శేరపల్లి మల్లేష్ దీక్ష చేపట్టారు. 

ఈ సందర్భంగా ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, ఇచ్చిన హామీలను అమలు చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో పటోళ్ల సురేందర్ రెడ్డి, పుట్నాల కృష్ణ, ఏ.డి. దయాకర్, ముత్యాలు, నగేష్ తదితరులు పాల్గొని దీక్ష చేస్తున్న ఉద్యమకారులకు సంఘీభావం తెలిపారు. 

హామీల అమలుపై ప్రభుత్వం ఇకనైనా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.

#Sidhumaroju

Alwal